Tuesday, May 26, 2026

― Advertisement ―

సమ్మెకు మద్దతు తెలిపిన జావీద్…!

విఏఓ ల సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వానికి కౌన్సిలర్ హెచ్చరిక విఏఓ లకు మద్దతు తెలిపిన జావీద్  జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమ్మెకు మద్దతుగా...
HomeNEWSగడప గడపకూ రోహిత్ రెడ్డి..!

గడప గడపకూ రోహిత్ రెడ్డి..!

spot_img
  • మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి
  • 21, 22 వార్డుల అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి
  • ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 21, 22వ వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు టిప్పు (21వ వార్డు), భాస్కర్ (22వ వార్డు) నివాసాల్లో ఆయా వార్డుల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఎన్నికల వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, పార్టీ శ్రేణులందరూ సమిష్టిగా కష్టపడి అభ్యర్థుల విజయానికి తోడ్పడాలని రోహిత్ రెడ్డి కోరారు. వార్డులోని ప్రతి గడపకూ వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించాలని సూచించారు. అనంతరం వార్డులోని పలువురు ప్రముఖులను, ముఖ్య వ్యక్తులను వారి నివాసాల్లో కలిసి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారుఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. టిప్పు, భాస్కర్ ఇద్దరూ ఎలాంటి స్వార్థం లేని వ్యక్తులు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే వీరు గెలిస్తేనే వార్డులు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయి అని పేర్కొన్నారు. వార్డుల సర్వతోముఖాభివృద్ధి కోసం అభ్యర్థులకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు.