- ఎన్నికల హామీని నెరవేర్చిన అనిల్ ఆర్మీ
- 6వ వార్డు లబ్ధిదారునికి నగదు అందజేత
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అనిల్ ఆర్మీ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం తన వంతు ఆర్థిక సాయం అందజేశారు.ఎన్నికల ప్రచార సమయంలో వార్డు పరిధిలో ఎవరైనా ఆడపిల్లల వివాహం జరిగితే రూ. 5,016లు, అలాగే ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. 5,000లు అందజేస్తానని అనిల్ ఆర్మీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం వార్డుకు చెందిన గుండప్ప పెద్ద కుమార్తె వివాహానికి హాజరై, రూ. 5,016 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అనిల్ మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకున్నా వార్డు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి, పేద కుటుంబాలకు అండగా ఉంటానని, ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు. కౌన్సిలర్ స్పందించి ఆర్థిక సాయం అందించడం పట్ల వార్డు ప్రజలు మరియు గుండప్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.




