Tuesday, April 21, 2026

అహంకారం మాది కాదు.. మీ మాజీ ఎమ్మెల్యేదే

-

spot_img
  • అభివృద్ధి చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలు: గాజుల మాధవి ఆగ్రహం
  •  గత ఐదేళ్ల పాలనలో జరిగింది అవినీతి తప్ప అభివృద్ధి కాదు
  •   మాజీ ఎమ్మెల్యే తీరుపై ప్రజలే విసిగిపోయారు
  •  అహంకారం మాది కాదు.. మీ నాయకుడిది: రాజు గౌడ్‌కు కౌంటర్

జానవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకార వేదికగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, వాస్తవాలు మాట్లాడితే అహంకారం అంటారా అని కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి ప్రశ్నించారు.  ఎమ్మెల్యే మనోహర్    రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. గురువారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ… బిఆర్ఎస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.గత ఐదేళ్ల కాలంలో పైలట్ రోహిత్ రెడ్డి హయాంలో తాండూరులో అభివృద్ధి కుంటుపడిందని, కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యారని మాధవి విమర్శించారు. రోడ్ల దుస్థితి, మౌలిక సదుపాయాల లేమిపై ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని, ఇది రోహిత్ రెడ్డి చేసిన “అభివృద్ధి”కి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో తాము సేవ చేశామని చెప్పుకుంటున్న నేతలు, అప్పట్లో జరిగిన అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.గత పదేళ్లుగా అరాచక పాలన సాగించిన వారికి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, రానున్న రోజుల్లో అది పూర్తిగా కనుమరుగవుతుందని అన్నారు. ప్రజలే మీ అవినీతి సామ్రాజ్యానికి తాళం వేశారని రాజు గౌడ్‌కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తోందని, ఎమ్మెల్యే నిధుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మాధవి పేర్కొన్నారు. సొంత పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను కప్పిపుచ్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే వర్గీయులు కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నారని ఆరోపించారు. అనవసర విమర్శలు మానుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories