- నృత్యంతో మానసిక ఉల్లాసం…!
- తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
జనవాహిని ప్రతినిధి తాండూరు : డాన్స్ నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తాండూరు డీఎస్పీ శ్రీ నర్సింగ్ యాదయ్య అన్నారు. గురువారం పట్టణంలోని జగదంబ టవర్స్‌లో శివ డాన్స్ స్టూడియో’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి నృత్య శిక్షణ శిబిరాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా ఇష్టమైన కళలను నేర్చుకోవాలని సూచించారు. తాండూరు ప్రాంతంలో ఇలాంటి శిక్షణా కేంద్రాలు ఉండటం వల్ల స్థానిక ప్రతిభావంతులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.స్టూడియో నిర్వాహకుడు శివ మాట్లాడుతూ.. ఈ వేసవి శిబిరంలో వెస్ట్రన్, ఫోక్, మాస్ డాన్స్‌లతో పాటు ప్రత్యేకంగా యోగా, క్లాసికల్ బేసిక్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మే 31వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.




