- తొలిసారిగా అధికారిక వేడుకలు
- వినతికి స్పందించిన యంత్రాంగం
- పాల్గొన్న అధికారులు, కౌన్సిలర్ లు…!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జగజ్యోతి బసవేశ్వర జయంతి వేడుకలు కోలాహలంగా జరిగాయి. మున్సిపల్ చరిత్రలో బసవన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ఇదే తొలిసారి. బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సుప్రీత కరుణాకర్ (34వ వార్డు), రూప రుద్రు పాటిల్ (36వ వార్డు)లు మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్లకు వినతిపత్రం అందజేసి ఈ వేడుకల నిర్వహణకు చొరవ చూపారు. దీంతో సోమవారం ఉదయం కార్యాలయంలో బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. కులవివక్ష లేని సమాజం కోసం పోరాడిన బసవన్న ఆశయాలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. మున్సిపల్ యంత్రాంగం సానుకూలంగా స్పందించి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




