Wednesday, April 22, 2026

​ఆందోళన వద్దు.. పరీక్షలు ధైర్యంగా రాయండి

-

spot_img
  • పదో తరగతి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి
  • బి.ఆర్.ఎస్.వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు
  • పరీక్షలు రాయనున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులందరూ ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని బి.ఆర్.ఎస్.వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఏడాది కాలంగా పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు పాటించాల్సిన పలు సూచనలను ఆయన వివరించారు. అనవసరమైన ఆందోళన చెందకుండా, ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు.పరీక్షా హాలులో సమయపాలన పాటిస్తూ, ప్రతి ప్రశ్నకు తగిన సమయాన్ని కేటాయించాలని కోరారు. సమాధాన పత్రాలు స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో ఉండేలా చూసుకోవాలని, అక్షరాలు గుండ్రంగా ఉంటే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. పరీక్షకు వెళ్లే ముందే హాల్ టికెట్, పెన్నులు వంటి అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులందరూ ఉన్నత మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని దత్తాత్రేయ రావు ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories