Wednesday, April 22, 2026

అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు…!

-

spot_img
  • అవినీతికి తావులేకుండా అర్హులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం
  • సుమారు రూ. 2.70 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి
  •  ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయండి: లబ్ధిదారులకు ఎమ్మెల్యే పిలుపు

జనవాహిని ప్రతినిధి తాండూరు : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఒక వరం లాంటివని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల్లో సుమారు రూ. 2 కోట్ల 70 లక్షల విలువైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ముందుగా తాండూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తాండూరు పట్టణం మరియు మండలానికి చెందిన 133 మంది లబ్ధిదారులకు రూ. 1,33,15,428/- విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మందికి రూ. 73,08,116/-, యాలాల్ ఎమ్మార్వో కార్యాలయంలో 61 మందికి రూ. 61,07,076/- విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో లబ్ధిదారులు ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు కానీ, మధ్యవర్తులు కానీ డబ్బులు అడిగితే స్వయంగా నాకు కాల్ చేయండి. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమేనని, నియోజకవర్గ అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రాజకీయ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories