అత్యవసర స్థితితో అర్ధాంగి ప్రాణాల కోసం ఓ భర్త సాహసం

ప్రమాదంలో గాయపడిన భార్యకు ఓ ఆసుపత్రిలో చికిత్స  పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మరో ఆసుపత్రికి తరలించమన్న వైద్యులు  రవాణా సౌకర్యంలేక 12 కిలోమీటర్లు సైకిల్ పై తీసుకువెళ్లిన భర్త ‘నాతిచరామి’ భార్య మెడలో మూడుముళ్లు వేసిన అతను కష్టకాలంలో తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాడు. ప్రమాదకర స్థితిలో ఉన్న భార్యను పన్నెండు కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి సైకిల్ పై చేర్చి ఆమె ప్రాణాలు కాపాడుకున్నాడో భర్త. పంజాబ్ లోని లూథియానాలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్వాపరాలు […]

Continue Reading

16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారం!

జార్ఖండ్ లోని దుంఖా జిల్లాలో ఘోరం బాలికపై స్నేహితుడితో పాటు మరో ఎనిమిది మంది అత్యాచారం రాత్రంతా అపస్మారక స్థితిలోనే ఉన్న బాధితురాలు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసి కొన్ని రోజులు కూడా గడవలేదు. అయినా, కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా జార్ఖండ్ లో మరో ఘోరం సంభవించింది. 16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది పాశవికంగా సామూహిక అత్యాచారం జరిపారు. దుంఖా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై జిల్లా […]

Continue Reading

వలస కార్మికులకు కూడు, గూడు కల్పించండి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

లాక్‌డౌన్‌లోనూ విజృంభిస్తున్న కరోనా నిన్న ఒక్క రోజే ఏడుగురి మృతి మొత్తం బాధితులు 721 మంది కరోనా వైరస్ కట్టడి కోసం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు అండగా నిలవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. అలాంటి వారికి ఆహారంతో పాటు వసతి ఏర్పాటు చేయాలని సూచించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని కేంద్రం సూచించింది. విద్యార్థులు తమ హాస్టళ్లలోనే కొనసాగాలని చెప్పింది. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని […]

Continue Reading

కరోనాపై పోరుకు రూ. 100 కోట్లతో బజాజ్ గ్రూప్ నిధి

పూణేలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి  కార్మికులు, ఇల్లు లేని వారిని, వీధి పిల్లలను ఆదుకుంటామని ప్రకటన ‘కరోనా’ కట్టడికి ముందుకొస్తున్న కార్పొరేట్‌ సంస్థలు కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరార్థులను ఆదుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో బజాజ్‌ గ్రూప్‌ కూడా చేరింది. పూణేలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కావాల్సిన […]

Continue Reading

ఆల్కహాల్ వాసన రావడంతో శానిటైజర్ ను తాగేసిన ఖైదీ.. మృతి!

కేరళలోని పాలక్కాడ్ లో ఘటన జైలులోనే తయారైన శానిటైజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా శానిటైజర్ లను అందుబాటులో ఉంచగా, మందు వాసన రావడంతో, దాన్ని ఆబగా తాగేసిన ఓ రిమాండ్ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. రామన్ కుట్టీ అనే ఓ ఖైదీ, శానిటైజర్ ను తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ శానిటైజర్ […]

Continue Reading

అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి: గో ఎయిర్

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ పార్కింగ్ లో వున్న 650 విమానాలు విమానాలతోపాటు సిబ్బందినీ సమకూర్చేందుకు గో ఎయిర్ సిద్ధం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అత్యవసర సేవల కోసం తమ విమానాలు వాడుకోవచ్చంటూ గో ఎయిర్ ప్రభుత్వానికి తెలిపింది. పౌరులను చేరవేసేందుకు విమానాలు ఇస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా సమకూరుస్తామని పేర్కొంటూ విమానయానశాఖ, డీజీసీఏలకు తెలియజేసింది. 56 విమానాలు ఉన్న గో ఎయిర్ సంస్థకు 5,500 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ […]

Continue Reading

కనిపిస్తున్న లాక్‌డౌన్ ప్రభావం.. తగ్గుతున్న కరోనా కేసుల పెరుగుదల నిష్పత్తి

కొత్త కేసులు తగ్గకున్నా పెరుగుదల నిష్పత్తి తగ్గింది ఎలా సోకిందో తెలియనంత మాత్రాన సామాజిక వ్యాప్తి కాదు  ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయకుంటే మాత్రం ప్రమాదమే దేశంలో లాక్‌డౌన్ వల్ల ఫలితాలు కనిపిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం వల్ల రోగుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తి మాత్రం తగ్గుతోందని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో ఉదాసీనత అస్సలు పనికిరాదని అన్నారు. దేశంలో కొందరు […]

Continue Reading

దేశంలోని అన్ని సీబీఎఫ్సీ కార్యాలయాల నిరవధిక మూత!

దేశంలోని 9 కేంద్రాల మూసివేత సినిమాల స్క్రీనింగ్ ఉండబోదు వైరస్ వ్యాప్తి తగ్గిన తరువాత తిరిగి తెరుస్తామన్న ప్రసూన్ జోషి ఇండియాలో ఉన్న 9 సీబీఎఫ్సీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్) కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు సంస్థ చైర్మన్ ప్రసూన్  జోషి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీబీఎఫ్సీకి సంబంధించిన క్లయింట్స్, ప్యానెల్‌ సభ్యులు, అధికారులు, ఉద్యోగుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని సీబీఎఫ్సీ కార్యాలయాలను మూసివేస్తున్నట్టు ఆయన తెలిపారు. […]

Continue Reading

దోమకాటుతో కరోనా వైరస్ వస్తుందా?.. స్పష్టత ఇచ్చిన కేంద్రం

దోమకాటు ద్వారా వైరస్ వ్యాపించదు వెల్లుల్లి తినడం వల్ల వైరస్‌ను అడ్డుకోలేం మరోమారు స్పష్టం చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ వ్యాప్తిపై జరుగుతున్న ఊహాగానాలకు ఇప్పటికే తెరదించిన కేంద్రం తాజాగా మరోమారు స్పష్టత ఇచ్చింది. చికెన్ తినడం వల్ల వైరస్ వస్తుందన్న ప్రచారం ఇప్పటి వరకు విపరీతంగా జరిగింది. దీనిని ఖండించిన ప్రభుత్వం ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే, గాలి ద్వారా, పేపర్ల ద్వారా ఈ వైరస్ ఒకరిని […]

Continue Reading

200 మందికి కూరగాయల పంపిణీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

లాక్‌డౌన్ ఆదేశాలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే కూరగాయల కోసం గుంపులు గుంపులుగా జనం సామాజిక దూరం పాటించని వైనం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దానిని అతిక్రమించి తన ఇంటి వద్ద కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరిలో జరిగిందీ ఘటన. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ ఉత్తర్వులను కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ ఉల్లంఘించారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కూరగాయల సంచులు పంపిణీ చేశారు. దాదాపు […]

Continue Reading