15.9 C
New York
Sunday, May 19, 2024

Buy now

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాం, ఇన్ పేషెంట్ల అడ్మిట్ లో రాష్ట్రంలోనే టాప్- జీజీహెచ్ సూపరిండెంట్-nizamabad news in telugu ggh superintendent pratima rai announces 2023 annual medical services report ,తెలంగాణ న్యూస్

Nizamabad GGH : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 2023 వార్షిక సంవత్సరంలో జరిగిన అరుదైన శస్త్ర చికిత్సలు, అభివృద్ధి పనులపై జీజీహెచ్ సూపరిండెంట్ ప్రతిమరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాదిలో ఆస్పత్రిలో ఎన్నో అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహించామని తెలిపారు. 1500- 2000 వరకు ఓపీలు, ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా రోజుకు 200- 400 వరకు పెరిగిందన్నారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల వారీగా జరిగిన అభివృద్ధి, అరుదైన చికిత్సలను గురించి వివిధ విభాగాధిపతులు తెలియజేశారు. టీహబ్ (తెలంగాణ డయాగ్నొస్టిక్) ద్వారా ఈ ఏడాది లో 4,41,452 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. టీ హబ్ సెంటర్ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉండటం విశేషం అని వైద్యులు తెలిపారు. సైకియాట్రి విభాగంలో డీ అడిక్షన్ సెంటర్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఈ సీట్ విధానం ద్వారా చికిత్సను అందించి ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వారి ఆలోచనలను నివారించామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 214 మందికి ఈ సీట్ ద్వారా చికిత్స జరిగిందన్నారు. 1912 మందికి డీ అడిక్షన్ ద్వారా చికిత్స అందిచామని వైద్యులు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles