22.7 C
New York
Sunday, May 19, 2024

Buy now

బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మార్పు.. ఎన్నికల్లోగా సాధ్యమేనా? | brs back to trs| possible| before| general| elections| kcr| strtegy

posted on Apr 7, 2024 3:49PM

ఔను నిజమే.. టీఆర్ఎస్ గా మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసించిన పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. పేరుకే జాతీయ పార్టీ అయినా.. తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీకి గుర్తింపు లేదని కేంద్ర ఎన్నికల సంఘం కుండ బద్దలు కొట్టేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయిన తరువాత ఇంత కాలం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి దూరమైంది.

ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ కాదు. అదో జాతీయ పార్టీ. రాష్ట్రంతో ఆ పార్టీ  బీజేపీ, కాంగ్రెస్ లలాగే ఒక రాజకీయ పార్టీ. అంతే అంతకు మించిన అనుబంధమేదీ ఆ పార్టీకి రాష్ట్రంలో లేకుండా పోయింది. బీఆర్ఎస్ గా మారనంత కాలం.. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నా తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలలో ఆ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ జనం గుండెలకు హత్తుకున్నారు.

అయితే ఎప్పుడైతే పార్టీలో తెలంగాణను తీసేశారో.. జనం కూడా ఒక ఆ పార్టీకి తమ హృదయాలలో ఉన్న ప్రత్యేకత ను తొలగించుకున్నారు.ఫలితం అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారం కోల్పోయిన క్షణం నుంచీ ఆ పార్టీ ప్రతిష్ఠ వేగంగా దిగజారుతోంది. అవినీతి కేసులు, అక్రమాల పుట్టలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ నుంచి మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27  పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పేరుతో పోటీ చేస్తే మెరుగైన  ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నాయి.  ఏదేమైనప్పటికీ, పార్టీ పేరును మార్చడానికి సంబంధించిన ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు.  

కేసీఆర్ సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు వివిధ కోణాలను,   పరిశీలిస్తారని పార్టీ కీలక నేత ఒకరు పేర్కొన్నారు.    ప్రస్తుతం పార్టీ పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించడానికి, పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను కట్టడి చేయడానికి  వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చనున్నట్లు ప్రచారంలోకి తీసుకువచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలలోపు  ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలైతే లేవని అంటున్నారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles