HomeEntertainmentథియేటర్లను షేక్ చేస్తున్న చిన్న సినిమా.. రూ. 100 కోట్లు కొళ్లగొట్టి..!

థియేటర్లను షేక్ చేస్తున్న చిన్న సినిమా.. రూ. 100 కోట్లు కొళ్లగొట్టి..!


థియేటర్లను షేక్ చేస్తున్న చిన్న సినిమా.. రూ. 100 కోట్లు కొళ్లగొట్టి..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవల ‘కే ర్యాంప్’, ‘క’ సినిమాలతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో మరోసారి హిట్టు తన ఖాతాలో వేసుకున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. జులై 24 విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్​ తో థియేటర్లలో రన్ అవుతుంది.

కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్ల దిశగా ఈ మూవీ దూసుకుపోతుంది. విడుదలైన తొలి రోజే భారీ వసూల్లు సాధించడమే కాకుండా వీకెండ్ లోపు 97 శాతంకు పైగా రీకవరీని సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రానున్న రోజుల్లో ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకునేలా ఉందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీలో కిరణ్ అబ్బవరం తన నటనతో మెప్పించారని కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో స్టీవెన్ శంకర్ పాత్రలో జీవించినట్లు మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ గౌరి ప్రియ తన సహజమైన హావభావాలు, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

KiranAbbavaram Chennai Love Story 4-day worldwide collections Heading towards gross of 100 crore

అలాగే ‘బేబి’ మూవీ ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ​ప్లే అందించారు. ఈ చిత్రానికి ఎస్​కేఎన్, సాయిరాజేశ్ నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న ఈ మూవీ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments