HomeTelanaganahyderabad25 ఏళ్ల నీటి సమస్యకు ముగింపు..!

25 ఏళ్ల నీటి సమస్యకు ముగింపు..!

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
  • రూప రుద్రు పాటిల్ చొరవతో సఫలమైన బోర్‌వెల్ తవ్వకం
  • హర్షం వ్యక్తం చేసిన 36వ వార్డు ప్రజలు

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు మున్సిపల్ పరిధిలోని 36వ వార్డు నివాసితులను గత 25 ఏళ్లుగా వేధిస్తున్న తీవ్ర తాగునీటి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. స్థానిక వార్డు కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్ ప్రత్యేక చొరవ, పట్టుదలతో శుక్రవారం వార్డులో నూతనంగా బోర్‌వెల్ తవ్వించారు.
గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేకమార్లు బోర్లు వేసినప్పటికీ నీళ్లు పడక నిరాశే మిగిలింది. అయితే వార్డు ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను ఎలాగైనా తీర్చాలనే సంకల్పంతో కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్ పట్టువదలకుండా మళ్లీ బోర్‌వెల్ తవ్వించడంతో సమృద్ధిగా నీరు పడింది. దీంతో కాలనీవాసుల ఆనందానికి హద్దులు లేవు.
పాతిక సంవత్సరాల సమస్య కొలిక్కి రావడంతో 36వ వార్డు ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. తమ తాగునీటి తిప్పలను తీర్చిన కౌన్సిలర్ రూప రుద్రు పాటిల్‌కు ఈ సందర్భంగా వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • READY v9.5 PRO
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments