Home Entertainment 'లెనిన్'కు తప్పని బాక్సాఫీస్ ఫైట్.. అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడా?

'లెనిన్'కు తప్పని బాక్సాఫీస్ ఫైట్.. అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడా?

4
0


‘లెనిన్’కు తప్పని బాక్సాఫీస్ ఫైట్.. అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడా?

Jul 9, 2026 10:23AM

Google search engine

అక్కినేని వారసుడు అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ పట్టుదలతో ఉన్నాడు. అందుకే గ్యాప్ తీసుకుని, పూర్తి వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్‌లో, మాస్ అవతారంలో కనిపించనున్నాడని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది.

నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేసింది. తొలుత మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల జూన్ 26 కి పోస్ట్‌పోన్ చేశారు. ఆ తర్వాత క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మాత నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని జులై 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే అఖిల్‌కు ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. సమ్మర్‌లో సోలోగా రావాలనుకున్న ‘లెనిన్’ చిత్రానికి ఇప్పుడు జులై 10న సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో ఏకంగా నాలుగైదు డబ్బింగ్ సినిమాలతో గట్టి పోటీ పడాల్సి వస్తోంది.

ఈ పోటీలో మొదటిగా చెప్పుకోవాల్సింది మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి. ప్రభాస్ ‘సలార్’ సినిమాలో వరదరాజ్ మన్నార్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన పృథ్విరాజ్, ఇప్పుడు ‘ఐ నో బడీ’ (I, Nobody) అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌తో జులై 10న థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తెలుగులోనూ భారీగా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంయుక్తంగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుండటంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 

దీనితో పాటు కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ మురళి కూడా టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశాడు. ఆయన నటించిన ‘ఇదయం మురళి’ అనే చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’ (Hrudhayam Murali) పేరుతో అదే రోజున విడుదల చేస్తున్నారు. కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఒక కీలక పాత్ర పోషించడం విశేషం.

ఇక వీటితో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటించిన ‘లవ్ ఓ లవ్’ (Love Oh Love) అనే చిత్రం కూడా జులై 10నే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాతో తెలుగు యూట్యూబర్ నాగదుర్గ హీరోయిన్ గా పరిచయమవుతుండటం విశేషం. అలాగే మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వసుదేవ సుతం’ సినిమా కూడా అదే రోజున లక్‌ను పరీక్షించుకోబోతోంది. 

ఒక్కోసారి డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ ఫైట్ లో తెలుగు స్టార్స్ కి షాకిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఆ అవకాశం ఉండదని, లెనిన్ అవుట్ పుట్ అదిరిపోయిందని అంటున్నారు. అఖిల్ సహా టీమ్ అంతా ‘లెనిన్’ రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ డబ్బింగ్ సినిమాల బాక్సాఫీస్ క్లాష్‌ను తట్టుకుని ‘లెనిన్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

 

 

Akhil Akkineni, Lenin Movie, I Nobody, Hrudayam Murali, Vasudheva Sutham

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here