Home Business భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జాతర.. ప్రతి కారు మైలేజ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జాతర.. ప్రతి కారు మైలేజ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

2
0

భారత మార్కెట్లో హైబ్రిడ్ కార్ల జాతర.. ప్రతి కారు మైలేజ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

ప్రస్తుతం భారతదేశంలో పర్యావరణహిత (గ్రీన్) వాహనాలకు డిమాండ్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుతానికి ఇండియాలోని హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్లో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సంస్థ సుమారు 80 శాతం వాటాతో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తోంది.

Google search engine

అయితే రాబోయే రోజుల్లో ఈ సెగ్మెంట్లో గట్టి పోటీ ఎదురుకాబోతోంది. టయోటా హవాకు బ్రేక్ వేసేందుకు హోండా, రెనాల్ట్, కియా, మారుతి సుజుకి వంటి ప్రముఖ కంపెనీలు తమ సరికొత్త హైబ్రిడ్ మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. దేశీయ మార్కెట్లో త్వరలోనే తహల్కా సృష్టించబోతున్న 5 మోస్ట్ అవేటెడ్ హైబ్రిడ్ కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Top 5 Upcoming Hybrid Cars in India That Promise Impressive Mileage and Performance

ఇదే నెలలో హోండా జెడ్ఆర్-వి ఎంట్రీ
ప్రముఖ కార్త తయారీ సంస్థ హోండా తన సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ ZR-V ని ఇదే నెలలో (జూలై 2026) భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ పవర్‌ఫుల్ కారులో 2.0-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

ఇది హోండాకు చెందిన సరికొత్త e strong హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజన్ సెటప్ సహాయంతో కారు గరిష్టంగా 184bhp పవర్‌ను, 315Nm టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంతటి పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నప్పటికీ, ఈ ప్రీమియం SUV లీటరు పెట్రోల్‌కు ఏకంగా 22.8 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని హోండా కంపెనీ గట్టిగా చెబుతోంది.

Top 5 Upcoming Hybrid Cars in India That Promise Impressive Mileage and Performance

కొత్త అవతారంలో రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్
ఒకప్పుడు భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ అవతారంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా ఈ కారు మార్కెట్లోకి రానుంది. ఇందులో 1.8-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.4kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను జోడించారు.

ఈ కారుపై భారతీయ కస్టమర్లలో ఏ స్థాయి క్రేజ్ ఉందంటే.. కారు అధికారికంగా లాంచ్ కాకముందే, 2026 సంవత్సరానికి కేటాయించిన డస్టర్ హైబ్రిడ్ మోడళ్లు అన్నీ పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోయినట్లు రెనో సంస్థ ప్రకటించింది.

లగ్జరీ లుక్‌తో కియా సోరెంటో
కొరియన్ కార్ల దిగ్గజం కియా సైతం భారత మార్కెట్లో తన మొట్టమొదటి హైబ్రిడ్ కారును పరిచయం చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. రాబోయే దీపావళి పండుగ సీజన్లో కియా కంపెనీ సోరెంటో అనే పెద్ద లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

Top 5 Upcoming Hybrid Cars in India That Promise Impressive Mileage and Performance

మూడు వరుసల సీటింగ్ సామర్థ్యం గల ఈ ప్రీమియం కారులో సరికొత్త 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను అందించబోతున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్లో అయితే ఈ కారు మరింత పవర్‌ఫుల్ 1.6-లీటర్ టీజీడీఐ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌తో అమ్ముడవుతోంది. భారతదేశంలోనూ ఈ లగ్జరీ కారు మంచి మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

ఫ్యామిలీ కోసం మారుతి 7-సీటర్ గ్రాండ్ విటారా
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారాకు అప్‌గ్రేడ్‌గా ఎక్కువ స్పేస్ ఉన్న 7-సీటర్ వెర్షన్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ త్రీ-రో కారు భారతీయ రోడ్లపై ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటోంది. 2026 చివరి నాటికి ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో కస్టమర్ల కోసం 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు లభిస్తాయి.

దీనికి పోటీగా టయోటా కంపెనీ కూడా తన అర్బన్ క్రూజర్ హైరైడర్ కారును 7-సీటర్ వేరియంట్‌లో పరీక్షిస్తోంది. ఈ రెండు కార్లు కూడా మూడో వరుస సీట్లతో ఎక్కువ లగేజ్ స్పేస్, భారీ కేబిన్ 1.5-లీటర్ పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజన్‌తో తక్కువ బడ్జెట్లోనే అదిరిపోయే మైలేజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here