Home Entertainment దళపతి విజయ్ బాటలో ధనుష్.. కొత్త పార్టీ.. స్టాలిన్‌తో భేటీ

దళపతి విజయ్ బాటలో ధనుష్.. కొత్త పార్టీ.. స్టాలిన్‌తో భేటీ

4
0


దళపతి విజయ్ బాటలో ధనుష్.. కొత్త పార్టీ.. స్టాలిన్‌తో భేటీ

Google search engine

తమిళనాడు రాజకీయాలకు, వెండితెరకు దశాబ్దాలుగా విడదీయరాని అనుబంధం ఉంది. నిన్న మొన్నటివరకు సినిమా స్క్రీన్‌పై రికార్డులు తిరగరాసిన స్టార్ హీరో దళపతి విజయ్.. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో అసెంబ్లీ బరిలోకి దిగి ఏకంగా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభంజనం సృష్టించారు. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో కోలీవుడ్ విలక్షణ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ కూడా ఖద్దరు చొక్కా తొడగడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ తాజా పరిణామాలు. ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒకే ఒక్క అంశం ఏమిటంటే.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ! దీనికి కారణం ఆయన అభిమాన సంఘం ఒక్కసారిగా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం.

సీఎం విజయ్ కేసును తేల్చేసిన సుప్రీం: కోర్టును రాజకీయ వేదికగా మార్చొద్దంటూ హితబోధ
సీఎం విజయ్ కేసును తేల్చేసిన సుప్రీం: కోర్టును రాజకీయ వేదికగా మార్చొద్దంటూ హితబోధ

తెరపైకి ‘అధికారిక జెండా’.. ఫ్యాన్స్ హడావిడి!

‘ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ తాజాగా సోషల్ మీడియాలో ఒక అధికారిక జెండాను ఆవిష్కరించింది. ఎరుపు, తెలుపు రంగుల కలయికతో.. ధనుష్ ఇరుచేతులు జోడించి నమస్కరిస్తున్న భంగిమలో ఉన్న ఈ జెండా లుక్ చూస్తే సాదాసీదా సేవా సంస్థ మార్కులా కాకుండా, పక్కా ఒక పొలిటికల్ పార్టీ జెండాలాగే డిజైన్ చేయడం విశేషం. దళపతి విజయ్ కూడా మొదట్లో తన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ఫ్యాన్స్ క్లబ్‌ను ఇలాగే సేవా కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ఆ తర్వాతే పార్టీగా మార్చారు. ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ కూడా అదే పంథాలో నడుస్తుండటంతో.. ఇది 2031 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్‌గా వేసిన లాంగ్ టర్మ్ స్కెచ్ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Dhanush follows in Thalapathy Vijay s footsteps New party meeting with Stalin

సీఎం స్టాలిన్‌తో భేటీ.. ఆంతర్యం ఏంటి?

ఈ పొలిటికల్ హీట్‌కు మరింత ఘాటు పెంచుతూ.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ను ధనుష్ మర్యాదపూర్వకంగా కలవడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ కేవలం వ్యక్తిగత అవసరాల కోసమా? లేక భవిష్యత్తు పొలిటికల్ స్క్రిప్ట్‌కు ఏమైనా ఇక్కడే పునాది పడిందా? అనే చర్చలు జోరందుకున్నాయి. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా రక్తదానం, ఉచిత విద్య సహాయం లాంటి సామాజిక సేవల పేరిట క్యాడర్‌ను లైన్ లో పెట్టాలని ధనుష్ తన అంతర్గత వర్గాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గట్టిగా వినిపిస్తోంది.

విజయ్ పార్టీలో చేరడంపై తేల్చి చెప్పిన పన్నీర్ సెల్వం: ఆ భావజాలమే నడిపిస్తోంది.. !!
విజయ్ పార్టీలో చేరడంపై తేల్చి చెప్పిన పన్నీర్ సెల్వం: ఆ భావజాలమే నడిపిస్తోంది.. !!

సైలెంట్ గా ఉన్న ధనుష్.. సస్పెన్స్ లో కోలీవుడ్!

ప్రస్తుతం చేతినిండా పాన్-ఇండియా ప్రాజెక్టులు, డైరెక్షన్ పనులతో బిజీగా ఉన్న ధనుష్ గానీ, ఆయన పీఆర్ టీమ్ గానీ ఈ ప్రచారంపై ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఇది కేవలం అభిమానుల ఉత్సాహమా? లేక ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం – ధనుష్’ అన్నట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద ప్లానే నడుస్తోందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ధనుష్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం.. తమిళనాట సరికొత్త రాజకీయ సమీకరణాలు మారడం ఖాయం!



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here