Home Business రూ.3.49 లక్షల కారుపై రూ.37,500 వరకు తగ్గింపు.. కొత్త కారు కొనడానికి ఇదే బెస్ట్ టైమ్!

రూ.3.49 లక్షల కారుపై రూ.37,500 వరకు తగ్గింపు.. కొత్త కారు కొనడానికి ఇదే బెస్ట్ టైమ్!

1
0

రూ.3.49 లక్షల కారుపై రూ.37,500 వరకు తగ్గింపు.. కొత్త కారు కొనడానికి ఇదే బెస్ట్ టైమ్!

కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రతినెలా వాహన తయారీదారులు తమ ఉత్పత్తులపై తగ్గింపులు అందిస్తుంటారు. దీని ద్వారా కంపెనీలు తమ స్టాక్‌ను ఎక్కువ అమ్ముకోగలుగుతాయి. అసలు ధర కంటే తక్కువలో లభించడం వలన వినియోగదారులు వాటిని కొనడానికి షోరూమ్‌లకు క్యూలు కడుతుంటారు. ఈ నేపథ్యంలో జులై నెల ప్రారంభం కాగానే ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి (Maruti Suzuki) కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి తన ప్రసిద్ద హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి ఎస్-ప్రెస్సో (S Presso) కారుపై భారీ ఎత్తున్న డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగానే ఈ కారు ధర చాలా తక్కువగా ఉంటుంది. పేద, మధ్యతరగతి వారు కూడా ఈజీగా కొనుగోలు చేసే విధంగా అందుబాటులోనే లభిస్తుంది.

Google search engine

తక్కువ ధర కలిగిన కారుపై ఆఫర్స్ ఇవ్వడం ద్వారా ఇది ఇంకా తక్కువకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండటం విశేషం. ఈ జూలైలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్న వారు ఎస్-ప్రెస్సో‌ను ఎంచుకోవచ్చు. ఆఫర్ గురించి చూసినట్లయితే ఈ హ్యాచ్‌బ్యాక్‌పై వినియోగదారులు రూ. 37,500 వరకు లాభం పొందే అవకాశం ఉంది. దీంతో ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మరింత తక్కువ ధరలో సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

Maruti S Presso Gets Discounts Up To Rs 37500 In July 2026 Details

ఈ ఆఫర్‌లో కేవలం నగదు తగ్గింపు మాత్రమే కాకుండా, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు ఇతర డీలర్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పాత కారును ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే వారికి అదనపు ప్రయోజనాలు లభించే అవకాశం ఉండటంతో, కొత్త ఎస్-ప్రెస్సో తక్కువకే లభిస్తుంది. అయితే ఆఫర్ విలువ నగరం, డీలర్‌షిప్, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉండటంతో, కొనుగోలుకు ముందు సమీపంలోని షోరూమ్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ బేస్ వేరియంట్ ధర రూ.3.49 లక్షల నుండి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ రూ. 5.25 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ బడ్జెట్ అంటే సాధారణంగా పేద, మధ్యతరగతి వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయగలుగుతారు. అయితే, ముఖ్యంగా ఈ నెలలో ప్రత్యేకంగా అందిస్తున్న తగ్గింపులు ఉపయోగించుకున్నట్లతే ఈ కారు మరింత తక్కువ ధరకే సొంతం అవుతుంది.

Maruti S Presso Gets Discounts Up To Rs 37500 In July 2026 Details

దీని పనితీరు గురించి చూసినట్లయితే, ఎస్-ప్రెస్సోలో 1.0-లీటర్ K10C పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 66 bhp పవర్‌తో పాటు 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లను కూడా అందిస్తోంది. దీంతో ఈ కారు నగరాలతో పాటు ఊర్లలో రోజువారీ వినియోగానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

మైలేజ్ విషయంలో కూడా మారుతి ఎస్-ప్రెస్సో ఆకట్టుకుంటుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 24.12 కిమీ నుంచి 25.30 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. మరోవైపు, ఫ్యూయల్ ఖర్చు ఎక్కువ ఉండద్దు అనుకునే వారి కోసం CNG వేరియంట్ కిలోకు 32.73 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, మెరుగైన మైలేజ్ కారణంగా ఎస్-ప్రెస్సో వినియోగదారులకు మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

Maruti S Presso Gets Discounts Up To Rs 37500 In July 2026 Details

ఈ కారులో ఫీచర్లు డజన్ల కొద్ది ఉన్నాయి. క్యాబిన్‌లో గుండ్రని సెంటర్ కన్సోల్ ఉంటుంది. దీనిలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో పాటు డిజిటల్ స్పీడోమీటర్ అందించారు. భద్రత పరంగా కొత్త మోడల్‌లో ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here