HomeEntertainmentరెండేళ్లుగా ఆయన పిలుస్తారని ఎదురుచూశా .. మెగా డాటర్ షాకింగ్ పోస్ట్

రెండేళ్లుగా ఆయన పిలుస్తారని ఎదురుచూశా .. మెగా డాటర్ షాకింగ్ పోస్ట్

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY


రెండేళ్లుగా ఆయన పిలుస్తారని ఎదురుచూశా .. మెగా డాటర్ షాకింగ్ పోస్ట్

మెగా డాటర్ నిహారిక కొణిదెల తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రాణించలేకపోయినా ఆ తర్వాత నిర్మాతగా మారి వరుస విజయాలతో తన మార్క్ చూపిస్తున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రాళ్లు’ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల విడుదలైన రెండో సినిమా రాకాస కూడా థియేటర్ లో మంచి విజయం సాధించింది. ఇలా వరుసగా విజయాలతో ఆమె ఫులో జోష్ లో ఉన్నారు.

ఇక ప్రస్తుతం నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా తన సోదరుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘బరి’. నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్​ పై ఈ ప్రాజెక్ట్ ​ను నిర్మిస్తున్నారు. అటు వరుణ్ కెరీర్​ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్​ తో ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి బరిలో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Niharika Konidela Shares Kashi Visveswara Visit Post Goes Viral on Social Media Niharika Konidela

ఇదిలాఉంటే నిహారిక కొణిదెల తాజాగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. తాజాగా కాశీ విశ్వేర్వరుడిని దర్శించుకున్న ఆమె ఈ మేరకు తన అధికారిక ఇన్ స్టా ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. పరమశివుడిపై తనకున్న అపారమైన భక్తిని చాటుతూ అందులో పేర్కొన్నారు. రెండేళ్లుగా తాను కాశీకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నా.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయని అన్నారు. ” ఓ రోజు మా పక్కింటివారు నాకు కాశీనుంచి తెచ్చిన రుద్రాక్ష ఇచ్చారు. అది దేవుడి ఆశీర్వాదంగా భావించి ఆరోజు రాత్రే కాశీకి టికెట్స్ బుక్ చేసుకున్నాను.

అలా వారణాసి పవిత్రస్థలంలో అడుగుపెట్టగానే అణువణువూ పరమశివుడు అనుభూతికి లోనయ్యాను. ఆయన సర్వాంతర్యామి అని అనిపించింది. అతనే ప్రారంభం.. అతనే ముగింపు.. మధ్యలోనూ అతనే.. అతని కుమార్తెగా ఎప్పటిగా ఉండాలని కోరుకుంటున్నా.. అని నిహారిక ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు హరహర మహాదేవ్ అని కామెంట్స్ పెడుతున్నారు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments