HomeEntertainmentథియేటర్ అంతా పాములే.. నీ సినిమా పిచ్చి పీక్స్ అన్నో..!

థియేటర్ అంతా పాములే.. నీ సినిమా పిచ్చి పీక్స్ అన్నో..!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY


థియేటర్ అంతా పాములే.. నీ సినిమా పిచ్చి పీక్స్ అన్నో..!

ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుంది.. ఏ సినిమా ప్లాఫ్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. చిన్న సినిమాలు సరైన కంటెంట్ తో వచ్చి హిట్టు కొట్టేస్తున్నాయి. టీజర్, ట్రైలర్ చూసి మోసపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రభాస్ ఆదిపురుష్, బాలయ్య అఖండ 2 , ఇప్పుడు నాగబంధం.. ఈ మూవీస్ కు రిలీజ్ కు ముందు క్రేజ్ బాగా ఉంది. కానీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. వందల కోట్లు పెట్టిన ఖర్చు స్క్రీన్ పై కనిపిస్తున్నా అవి ఆడియన్స్ కు మాత్రం ఎక్కలేదు. దాంతో అంత భారీ బడ్జెట్ బూడిద పాలు అని అంటున్నారు.

తాజాగా నాగబంధం మూవీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 3 న విడుదలైన ఈ మూవీకి నెగటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఎంచుకున్న కాన్సెప్ట్ , ఇలా ప్రతీ ఒక్కటి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. కానీ తీరా థియేటర్ కు వెళ్తే ఆ స్క్రీన్ ప్లే సరిగా లేదని.. ఒక్కో సీన్ కు మధ్య రిలేషన్ లేదని.. మూవీ బాగా ల్యాగ్ అయిందని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నా వాటితో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కంటెంట్ సరిగ్గా ఉంటే ఈ మూవీ ఓ విజువల్ వండర్ లా నిలిచిపోయేదని చెబుతున్నారు.

NagaBandham First Day Collection Tollywood Movie Box Office Earnings Revealed Naga Bandham movie

నాగబంధం మూవీ తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్లు రాబట్టింది. ఇండియాలో ఈ మూవీ రూ.3.24కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఫుల్ రన్ లో కూడా రావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూవీ మరి ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాల్సి ఉంది. అయితే టాక్ ఎలా ఉన్న వీకెండ్ వరకూ ఈ మూవీ బాగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments