18.2 C
New York
Saturday, May 18, 2024

Buy now

TS Graduate MLC Election 2024 : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Warangal Khammam Nalgonda Graduate MLC Election 2024 :  ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్(Telangana Graduate MLC By Election ను ఈసీ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ముఖ్య తేదీలను వెల్లడించింది.  మే 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మే 10న నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. మే 13న ఉపసంహరణకు చివరి తేదీగా పేర్కొంది. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ప్రకటించింది.  జూన్‌ 5న కౌంటింగ్‌ ఉంటుందని వెల్లడించింది. 

ముఖ్య తేదీలు :

  • మే 2వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల.
  • మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.
  • మే13న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ.
  • మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. 
  • జూన్‌ 5న ఓట్ల లెక్కింపు.

పల్లా రాజీనామాతో ఎన్నికలు…

వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023 డిసెంబర్ లో  జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్తా ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా… ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా… చివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పేరు ఖరారు

ఇక గతంలో ఈస్థానం నుంచి అత్యంత కష్టం మీద గెలిచిన బీఆర్ఎస్…. మరోసారి గెలవటం అతిపెద్ద సవాల్ గా మారనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఈ స్థానం నుంచి ఎవరు అభ్యర్థులుగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిన్ననే ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరేనిది తేలాల్సి ఉంది. 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles