HomeEntertainmentసెప్టెంబరు 1 నుంచి తమిళ సినిమాల రిలీజ్ బంద్.. ' జైలర్ 2 ' సినిమా...

సెప్టెంబరు 1 నుంచి తమిళ సినిమాల రిలీజ్ బంద్.. ‘ జైలర్ 2 ‘ సినిమా విడుదలకు కష్టాలు..!

కోలీవుడ్ లో థియేటర్- ఓటీటీ వివాదం ముదిరినట్లు స్పష్టం అవుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ రూల్స్ అండ్ కండిషన్స్ పై థియేటర్ యాజమాన్యాలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడులో కొత్త తమిళ సినిమాలను విడుదల చేయకూడదని తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది పూర్తిస్థాయిలో బంద్ కాదని, సినిమా షూటింగ్‌ లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు యథావిధిగా కొనసాగుతాయని టీఎఫ్‌పీసీ వెల్లడించింది.

ఈ వ్యవహారం నేపథ్యంలో సెప్టెంబర్ 1 తర్వాత రిలీజ్ కానున్న తమిళ సినిమాలపై తీవ్ర ప్రభావం పడనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 తో పాటు ఇతర పెద్ద సినిమాలు ఈ మేరకు రిలీజ్ కానున్నాయి. అయితే తాజాగా టీఎఫ్‌పీసీ తీసుకున్న నిర్ణయం మేరకు జైలర్ 2 సినిమా రిలీజ్ కు కష్టాలు తప్పేలా కనబడటం లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ విక్టరీ సాధించడంతో జైలర్ 2 పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. కానీ తమిళనాడులో థియేటర్- ఓటీటీ వివాదం నేపథ్యంలో జైలర్ 2 సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ మిస్ అయితే సంక్రాంతి, లేదా సమ్మర్ లోనే జైలర్ 2 సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక కోలీవుడ్ లో ప్రస్తుతం నెలకున్న ఈ వివాదానికి గల ప్రధాన కారణం.. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ లో స్ట్రీమింగ్ చేసే కాలపరిమితి అని తెలుస్తోంది. సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని థియేటర్స్ యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన వెంటనే ఓటీటీలోకి రావడం కారణంగా ప్రేక్షకులు థియేటర్లలోకి రావడం తగ్గిస్తున్నారని థియేటర్ల యజమానులు వాపోతున్నారు. తద్వారా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఈ వివాదం కారణంగా తమిళంలో రిలీజ్ కు సిద్దమైన చాలా సినిమాలు ఇబ్బందుల్లో పడ్డాయి. కార్తి సర్దార్ 2, ఇమ్మోర్టల్, సూరి అండ్ సుహాస్, మాందాడి, డీమోంట్ కాలనీ 3, విజయ్ సేతుపతి బత్ హా, సిగ్మా తదితర సినిమాల రిలీజ్ ఇప్పుడు సంక్లిష్టంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments