HomeEntertainmentIrumudi Movie Review: మాస్ మహారాజా ఖాతాలో పవర్ ఫుల్ హిట్.. క్లైమాక్స్ కన్నీళ్లే!

Irumudi Movie Review: మాస్ మహారాజా ఖాతాలో పవర్ ఫుల్ హిట్.. క్లైమాక్స్ కన్నీళ్లే!

Irumudi Movie Review: వరుస పరాజయాల తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఇరుముడి’. ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం, గ్రామంలో చిన్న పిల్లలకు ఎదురయ్యే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఓ ఆదర్శవంతమైన తండ్రిగా రవితేజ, ఆయన కూతురుగా బేబీ నక్షత్ర ఈ స్టోరీకి ప్రాణప్రతిష్ట చేశారు.

స్టోరీ
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరోకు తన కూతురు అంటే చాలా ఇష్టం. గ్రామంలో అనుకోకుండా కొందరు అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. అందరిలో తన కూతురును చూసుకునే హీరో ఈ వరుస ఘటనల వెనుక మిస్టరీని కనిపెట్టాలని అనుకుంటాడు. గ్రామంలోని యువతుల జీవితంలో జరిగే దిగ్భ్రాంతికరమైన సంఘటనలు, ప్రేమగల ఈ తండ్రి వాటిని ఎలా ఎదుర్కోవలసి వస్తుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. మంచి కథ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి నిరూపించాడు.

రవితేజ పవర్‌ఫుల్ పర్ఫామెన్స్
వరుస డిజాస్టర్ల అనంతరం రవితేజ తన వయస్సుకు తగ్గ, నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఎంచుకుని అద్భుతమైన నటనను కనబరిచాడు. ఎంత కంట్రోల్ తో కూడిన ఆయన యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలంగా మారింది. భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్ పరిమితి మేరకు మెప్పించగా.. కూతురి పాత్రలో నటించిన బేబీ నక్షత్ర ఎంతో పరిణతి చెందిన నటనతో ఆకట్టుకుంది. సాయికుమార్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

ఎమోషనల్ ఫస్టాఫ్.. నెమ్మదించిన ఇంటర్వెల్
పాఠశాలలో జరిగే ఓ విషాదకర ఘటనతో స్టోరీ ప్రారంభమై.. అనంతరం హీరో పరిచయం.. ‘ఇరుముడి’ టైటిల్ సాంగ్ తో సినిమా నడుస్తుంది. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, అయ్యప్పమాల ఆధ్యాత్మిక నేపథ్యాన్ని డైరెక్టర్ ఎంతో చక్కగా తెరకెక్కించారు. అయితే ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ సీన్లలో రావలసినంత ఇంటెన్సిటీ తగ్గడంతో స్టోరీ కాస్త వేగం తగ్గినా.. మొదటి భాగం మొత్తం ఆకట్టుకునేలా సాగుతుంది.

రెండో భాగంలో థ్రిల్లర్, విలన్(ఎమ్మెల్యే) ట్రాక్‌లను నడపడంలో డైరెక్టర్ శివ నిర్వాణ కొంత తడబడ్డారు. సస్పెన్స్ మిస్సవ్వడం, సస్పెన్స్ ను ముందే వెల్లడించడం వల్ల థ్రిల్లర్ కథనాన్ని ఆశించే వారికి ఇది కొంత నిరాశ కలిగిస్తుంది. కానీ స్టోరీలోన బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను చివరి వరకు సీటును కట్టిపడేస్తాయి.

కంటతడి పెట్టించే ముగింపు
సినిమా చివరి 20 నిమిషాల్లో వచ్చే తండ్రీ కూతుళ్ల క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టిస్తాయి. సాంకేతిక విభాగంలో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీలోని దైవత్వాన్ని, థ్రిల్ ను సరిగ్గా ప్రతిబింబించాయి. విష్ణు శర్మ ఛాయాగ్రహణం ఓ మలయాళ గ్రామీణ సినిమా తరహాలో చాలా సహజంగా దృశ్యరూపంలో ఆకట్టుకుంది.

ఫైనల్‌గా..
థ్రిల్లర్ సీన్లలో కొంత ఉత్కంఠ కొరవడినప్పటికీ, రవితేజ నటన, బలమైన ఎమోషనల్ కనెక్ట్, క్లైమాక్స్ దృశ్యాలు ‘ఇరుముడి’ చిత్రాన్ని తప్పక చూడదగినదిగా నిలబెట్టాయి.

రేటింగ్: 3.5/5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments