- సొంత పార్టీ నేతలపైనే కాంగ్రెస్ నాయకుడి దాడి ఆరోపణలు
- తాండూరులో తీవ్ర కలకలం
- అధికార పార్టీ లో గందరగోళం
- ఘటనతో పోలీసులు భారీ బందోబస్త్
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఒక్కసారిగా భగ్గుమంది. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వార్డు కమిటీల ఏర్పాటుపై ప్రశ్నించినందుకు, తన సొంత పార్టీకి చెందిన నాయకులే తనపై భౌతిక దాడులకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకుడు నాసెర్ ఆరోపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
బాధితుడు నాసెర్ కథనం ప్రకారం… గత శుక్రవారం రాత్రి రాజీవ్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు సాయప్ప, ఆయన కుమారుడు మరియు మరికొందరు అనుచరులతో కలిసి తనపై ఒక్కసారిగా దాడికి దిగారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, జెండా మోసిన కార్యకర్తలపైనే ఇలాంటి దాడులకు తెగబడటం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కొందరు నేతలు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ప్రశ్నించే వారిపై భౌతిక దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాసెర్ పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు వీధిపోరాటానికి దారితీయడంపై స్థానిక ప్రజలు, శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. తాండూరు ఈ ఘటన జరగడం తో భారీగా పోలీసులు మోరహయించారు. ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
