- 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ మౌజామ్
- భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశీస్సులతో బరిలోకి..
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల హడావిడి జోరందుకుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ మౌజామ్ బరిలో ఉన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆశీస్సులతో తాను 28వ వార్డు నుండి పోటీ చేస్తున్నట్లు షేక్ మౌజామ్ వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తానని, వార్డులోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.28వ వార్డులో ఈసారి భారీ మెజారిటీతో విజయం అందుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, గెలిచిన వెంటనే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు, వార్డు ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.






