Thursday, May 28, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSఇర్షాద్ పై దాడి జరగలేదు...?

ఇర్షాద్ పై దాడి జరగలేదు…?

spot_img
  • తాండూరు కౌన్సిలర్ ఈర్షాద్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్..
  •  భర్త అసలు రంగు బయటపెట్టిన భార్య!

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్‌పై జరిగిన దాడి ఘటన అనూహ్య మలుపు తిరిగింది. శుక్రవారం రాత్రి తనపై బావమరిది దాడి చేశారంటూ ఈర్షాద్ చేసిన ఆరోపణలను ఆయన భార్య తీవ్రంగా ఖండించారు. అసలు నిజం వేరే ఉందని ఆమె మీడియా ముందుకు వచ్చారు.​పెళ్ళైన నాటి నుండి వరకట్నం కోసం ఈర్షాద్ తనను తీవ్రంగా వేధిస్తున్నారని, రోజు నరకం చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి కూడా తనపై దాడి చేయడంతో తట్టుకోలేక సోదరుడికి ఫోన్ చేశానని, తనను రక్షించుకోవడానికే సోదరుడు వచ్చాడని స్పష్టం చేశారు. తనను వదిలెయ్యడానికి…. వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఇర్షాద్ ఉన్నారని ఆమె తేల్చి చెప్పారు. బాధితురాలిగా ఉన్న తననే దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వాపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన తాండూరు లో కలకలం రేపుతుంది.