Monday, March 16, 2026

28వ వార్డులో ‘అనురాధ’ ఏకపక్షం!

-

spot_img
  • 28వ వార్డులో ‘అనురాధ’ ఏకపక్షం!
  •  జోరుగా సాగిన మాజీ కౌన్సిలర్ ప్రచారం
  •  గులాబీ జెండా నీడన ఒక్కటవుతున్న ఓటర్లు
  •  అభివృద్ధికి పట్టం కడతామంటున్న వార్డు ప్రజలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో 28వ వార్డు రాజకీయ చిత్రం స్పష్టమవుతోంది. ఈ వార్డులో మాజీ కౌన్సిలర్ అనురాధ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ఆమెకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, వార్డుపై గులాబీ జెండా పట్టు బిగిసినట్లు కనిపిస్తోంది.గత పదవీ కాలంలో అనురాధ చేసిన అభివృద్ధి పనులు ఆమెకు ప్రధాన బలంగా మారాయి. వార్డులోని మౌలిక సదుపాయాల కల్పనలో ఆమె చూపిన చొరవను ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. “మా సమస్యలపై అవగాహన ఉండి, నిరంతరం అందుబాటులో ఉండే నాయకురాలికే మా ఓటు” అని వార్డు వాసులు ముక్తకంఠంతో చాటుతున్నారు. ముఖ్యంగా యువత, వృద్ధులు ఆమె వెంటే నడుస్తుండటంతో ప్రచారం జోరుగా సాగింది. స్థానిక సమీకరణాలు కూడా ఆమెకు అనుకూలంగా ఉండటంతో, ప్రత్యర్థులు రేసులో వెనుకబడినట్లు తెలుస్తోంది.అనురాధ గెలుపు ఇప్పటికే ఖాయమైంది.. కేవలం మెజారిటీ ఎంత అనేదే ఇప్పుడు చర్చ అని స్థానిక నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో ఆమె పోషించిన పాత్ర ఓటర్లలో బలమైన నమ్మకాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో 28వ వార్డులో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడటం లాంఛనమేనని స్పష్టమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories