Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSవార్డు ప్రజలకు ఇబ్బంది కలగనివ్వను...!

వార్డు ప్రజలకు ఇబ్బంది కలగనివ్వను…!

spot_img
  • అంబేద్కర్ నగర్ ప్రజల దాహార్తిని తీర్చిన కౌన్సిలర్
  •  మున్సిపల్ చైర్‌పర్సన్ సహకారంతో బోరింగ్ పునరుద్ధరణ

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎండలు ముదురుతున్న వేళ పాత తాండూరులోని అంబేద్కర్ నగర్ కాలనీలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని వార్డు కౌన్సిలర్ దివిటీ ఎల్లప్ప పరిష్కరించారు. కాలనీలోని ప్రధాన బోరింగ్ పాడైపోవడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన, మున్సిపల్ చైర్‌పర్సన్ సహకారంతో తక్షణ చర్యలు చేపట్టారు. చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి, పాడైన మోటార్‌ను బయటకు తీయించి రిపేర్ చేయించారు. అనంతరం బోరింగ్‌ను ఫ్లషింగ్ చేయించి, నీటి లభ్యత పెరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో, కాలనీ వాసుల ఇబ్బందులను అర్థం చేసుకుని స్వయంగా పర్యవేక్షించి బోరింగ్‌ను పునరుద్ధరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దివిటీ ఎల్లప్ప మాట్లాడుతూ.. వార్డులో ప్రజలకు కనీస సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, నీటి సమస్య తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. తమ విన్నపానికి సానుకూలంగా స్పందించిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి కి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.