Wednesday, April 22, 2026

నేడే ‘హిందూ సమ్మేళనం..!

-

spot_img
  •  ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ ప్రత్యేక కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా శ్రీ కమలానంద భారతీ స్వామి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని అయ్యప్ప బస్తీలో నేడు భారీ ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళన ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ భాస్కర్ హక్కే ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపితమై 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా, కేసరపల్లిలోని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి, ప్రముఖ హిందూ ధార్మిక ప్రవచన కర్త పూజ్య శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి వారు విచ్చేసి అనుగ్రహ భాషణం చేయనున్నారు. అలాగే, సంఘ సిద్ధాంతాలపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్య వక్తగా ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి మాన్య శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం హాజరవుతారు.భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం పట్ల సమాజంలో చైతన్యాన్ని నింపడం, ఏకాత్మత భావాన్ని పెంపొందించడం మరియు దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సమ్మేళనం జరుగుతోందని నిర్వాహకులు వివరించారు.ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు అయ్యప్ప నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం పక్కన ఈ సమ్మేళనం ప్రారంభమవుతుంది. ఈ ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమంలో అయ్యప్ప బస్తీ నివాసులతో పాటు పట్టణంలోని హిందూ బంధువులు, ధర్మాభిమానులు తమ కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ సమితి కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories