రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ మాస్కోకు వెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ రెండు నెలల వ్యవధిలో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్లో పర్యటించి, ఆయా దేశాధినేతలను కలిసిన అనంతరం ఈ వార్త వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.