స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ…
స్త్రీ 2 మూవీతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే భయపెట్టాడు దర్శకుడు అమర్ కౌశిక్. చందేరీ ఊరిలో మోడ్రన్ అమ్మాయిలు ఒక్కొక్కరుగా మిస్సవుతుంటారు. వారికి సర్‌ఖటా అనే దయ్యం మాయం చేస్తుందని విక్కీ(రాజ్ కుమార్ రావ్), బిట్టు, రుద్ర (పంకజ్ త్రిపాఠి) కనిపెడతారు. సర్‌ఖటా బారి నుంచి ఊరి ప్రజలను కాపాడటానికి స్త్రీ సాయం కోరుతాడు విక్కీ. ఊరి నుంచి వెళ్లిపోయిన స్త్రీ మళ్లీ వచ్చిందా? విక్కీ అండ్ గ్యాంగ్‌కు సాయం చేసిందా? స్త్రీ కూతురికి విక్కీ ప్రియురాలికి (శ్రద్ధా కపూర్) ఉన్న సంబంధం ఏమిటి అన్నదే స్త్రీ 2 మూవీ కథ.