హైడ్రా నోటీసులు ఇవ్వబోదు..
చెరువుల పరిరక్షణ ముఖ్యమైన అంశమే కానీ.. దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ఇంకా ముఖ్యమని ఏవీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వారికి తగిన సమయం ఇస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే ధర్మసత్రాలైనా కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. హైడ్రా నోటీసులు ఇవ్వబోదని.. డైరెక్ట్‌గా కూల్చివేయడమేనని స్పష్టం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా.. పలు చెరువులు, పార్కుల ఆక్రమణలపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.