posted on Sep 18, 2024 6:02PM
తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హర్యానాకి చెందినదీక్ష, తమిళనాడుకు చెందిన సుస్మిత, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొడ్డు హేమంత్, మనీషా వంగల రెడ్డిలను కేంద్రం కేటాయించింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి జమ్ముకశ్మీర్‌కు చెందిన మనన్ భట్, తెలంగాణకు చెందిన రుత్విక్ సాయి కొట్టే, సాయి కిరణ్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యాదవ్ వసుంధరను కేంద్రం కేటాయించింది.