Lok Sabha session: Lok Sabha session: పార్లమెంటు సమావేశాలు జూన్ 24, 2024 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, జూన్ 24న నూతన లోక సభ కొలువుతీరుతుంది. ఆ రోజు నుంచి రెండు రోజుల పాటు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. జులై 22న పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడ్తారు. 18వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభం కానున్నాయని, పార్లమెంటు దిగువ సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు మొదటి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.