posted on Jun 9, 2024 7:45PM
ఈసారి ఐదుగురు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 8 వేల మంది దేశ, విదేశ ప్రముఖులతోపాటు సార్క్ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, సినీ నటుడు షారుక్ ఖాన్, రజనీకాంత్‌తోపాటు ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి, పలు పీఠాధిపతులు పాల్గొన్నారు.