Home అంతర్జాతీయం IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు;...

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

0

ఉత్తరాదిన వడగాలులు

పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్ లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. పంజాబ్, హరియాణాలో కూడా ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ కు దగ్గరగా ఉందని, యూపీ సహా ఆయా రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తున్నాయని తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో మరో ఐదు రోజులు, మధ్యప్రదేశ్, బిహార్లలో నాలుగు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, దీనివల్ల ఉష్ణోగ్రత కాస్త తగ్గే అవకాశం ఉందన్నారు. ఐఎండీ బులెటిన్ ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.

Exit mobile version