Home అంతర్జాతీయం UGC PHD : యూజీ డిగ్రీ తర్వాత ఇక డైరక్ట్​గా పీహెచ్​డీ! నెట్​ రాస్తే చాలు..

UGC PHD : యూజీ డిగ్రీ తర్వాత ఇక డైరక్ట్​గా పీహెచ్​డీ! నెట్​ రాస్తే చాలు..

0

UGC PHD : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన విద్యార్థులు.. ఇకపై నేరుగా నెట్​కు హాజరై పీహెచ్​డీ చేయవచ్చు! ఈ విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ తాజాగా వెల్లడించారు.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ఉన్నా, లేకపోయినా పీహెచ్​డీ చేయాలంటే.. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో కనీసం 75 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన గ్రేడ్లు ఉండాలి.

UGC NET : ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్)కు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

“నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన అభ్యర్థులు ఇప్పుడు నేరుగా పీహెచ్​డీ చేసి నెట్​కు హాజరుకావచ్చు. అలాంటి అభ్యర్థులు ఏ విభాగంలో నాలుగేళ్ల బ్యాచులర్ డిగ్రీ పొందారో అన్న విషయంపై సంబంధం లేకుండా.. తమకు నచ్చిన సబ్జెక్టులో పీహెచ్​డీ చేసేందుకు అనుమతిస్తారు,’ అని కుమార్.. పీటీఐకి తెలిపారు.

“నాలుగు సంవత్సరాలు లేదా ఎనిమిది సెమిస్టర్ బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్​లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు.. గ్రేడింగ్ విధానాన్ని అనుసరించిన చోట పాయింట్ స్కేల్​లో కనీసం 75 శాతం మార్కులు లేదా అందుకు సమాన గ్రేడ్ కలిగి ఉండాలి” అని యూజీసీ ఛైర్మన్ చెప్పారు.

UGC NET 2024 June session : యూజీసీ నిర్ణయం మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కులు లేదా అందుకు సమాన గ్రేడ్ సడలింపు ఇవ్వొచ్చని తెలిపారు.

యూజీసీ నెట్ రిజిస్ట్రేషన్​ ప్రారంభం..

యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభమ య్యాయి. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు యూజీసీ నెట్ 2024 జూన్ సెషన్ కోసం ఏప్రిల్ 20వ తేదీ నుంచి ugcnet.nta.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టెప్​ 1:- ముందుగా విద్యార్థులు ఎన్​టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in ను ఓపెన్ చేయాలి.

స్టెప్​ 2:- హోమ్ పేజీలోని ‘న్యూ రిజిస్ట్రేషన్’ బటన్ పై క్లిక్ చేయాలి.

UGC NET : స్టెప్​ 3:- ఆ తరువాత, రిజిస్ట్రేషన్ క్రిడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

స్టెప్​ 4:- కొత్త విండో ఓపెన్ అవుతుంది.

స్టెప్​ 5:- అందులో కనిపించే అప్లికేషన్ ఫామ్ ను నింపండి.

స్టెప్​ 6:- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.

UGC NET 2024 june session application form స్టెప్​ 7:- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.

స్టెప్​ 8:- సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.

ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Exit mobile version