Home తెలంగాణ తనమీద తానే రాయి విసిరించుకోవడం దారుణం, కుట్ర.. వైసీపీ నేతలు | self attack conspiracy|...

తనమీద తానే రాయి విసిరించుకోవడం దారుణం, కుట్ర.. వైసీపీ నేతలు | self attack conspiracy| joguramesh| harras| illegal

0

posted on Apr 15, 2024 6:22AM

ఎవరు విసిరించుకున్నా తన మీద తానే రాయి విసిరించుకోవడం అనేది దారుణమని, కుట్ర అని వైసీపీ నేతలు గతంలో అన్నారు.  నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం తనమీద తాను రాయి విసిరించుకోవడం  అని జోగి రమేష్ ఆవేశంగా అన్నారు.

అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అందర్నీ హెరాస్ చేస్తున్నాడు కాబట్టే మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన జరిపే కార్యక్రమంలో భాగంగా ఎవరో తుంటరి వాళ్ళు రాళ్లు విసిరి వుండొచ్చు.. చెప్పులు వేసి వుండొచ్చు. బాటా కంపెనీ చెప్పులు చూపించి బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి… రాయి చూపించి ఈ రాయికి ఫలానావాడు సమాధానం చెప్పాలి అనడమేంటి… నాకు అర్థం కాలేదు?

నీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’’ అని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు జగన్ తనమీదే తాను గులకరాయి దాడి చేయించుకున్న నేపథ్యంతో ఈ మాటలన్నీ జగన్‌కే వర్తించేలా వున్నాయి.

Exit mobile version