Home తెలంగాణ వైసీపీకి షాక్… పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా 

వైసీపీకి షాక్… పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా 

0

posted on Apr 13, 2024 4:47PM

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి  ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం. పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీలో ఇమడలేక రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ వెంటనే షర్మిలను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Exit mobile version