Home బిజినెస్ ‘’బోర్న్ విటా సహా ఈ డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి’’- ఈ...

‘’బోర్న్ విటా సహా ఈ డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి’’- ఈ కామర్స్ సంస్థలకు ప్రభుత్వం అల్టిమేటం

0

బోర్న్ విటా వివాదం

బోర్న్ విటా లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని ఏడాది క్రితం ఫిర్యాదు వచ్చింది. దీనిపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) బోర్న్ విటా బ్రాండ్ యాజమాన్య సంస్థ అయిన మాండెలెజ్ ఇండియా లిమిటెడ్ కు నోటీసులు జారీ చేసింది. అనంతరం, బోర్న్ విటాను సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెపుతూ, తప్పు దోవ పట్టించే వాణిజ్య ప్రకటనలను తొలగించాలని మాండెలెజ్ ఇండియా లిమిటెడ్ ను ఆదేశించింది. బోర్న్ విటా హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసుకుంటోందని, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అధిక శాతం చక్కెరను వినియోగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ డ్రింక్ తో పిల్లల పెరుగుదల, అభివృద్ధి మెరుగుపడుతుందనే వాదనలు చేస్తుందని బోర్న్ విటాపై ఫిర్యాదు రావడంతో ఎన్సీపీసీఆర్ (NCPCR) రంగంలోకి దిగింది.

Exit mobile version