Home తెలంగాణ Warangal : 50 ఏళ్ల తరువాత కొత్త వంతెన

Warangal : 50 ఏళ్ల తరువాత కొత్త వంతెన

0

50 ఏళ్ల తరువాత కొత్త వంతెన సాకారం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి

నయీంనగర్​ నాలాపై 50 ఏళ్ల తరువాత కొత్త వంతెన నిర్మిస్తున్నామని, దీంతో ఈ ప్రాంత ప్రజలకు వరద సమస్యలు తీరిపోనున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి అన్నారు. పాత బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నయీంనగర్​ నాలా ఆక్రమణకు గురి కావడంతో వర్షాకాలంలో ఇదివరకు హనుమకొండ సిటీ ఏరియా మునిగిపోయిందన్నారు. గత ప్రభుత్వం రెండు టర్మ్​ లు అధికారంలో ఉండి కూడా నయీంనగర్ బ్రిడ్జ్ కు శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వరదల నివారణకు ప్రత్యేక నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ టి. అశోక్ రావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, చాడ స్వాతి రెడ్డి, వేముల శ్రీనివాస్, చీకటి శారదా ఆనంద్, మానస రాంప్రసాద్, మామిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version