కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట అశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.