ఆ యువకుడే కాదు.. ఎవరైనా కూడా జీవితంలో అద్దం చూపేంత స్పష్టంగా ఉండాలి. వెనుకో మాట ముందో మాట మాట్లాడకూడదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించకూడదు. మీలో ఉన్న లోపాలను చెబితే వెంటనే కోపగించుకోవడం, వారితో గొడవలు పడడం చేస్తే ఎలాంటి లాభం ఉండదు. అద్దంలో మీ ముఖంపై ఉన్న మరకలు చూసి ఎలా సరి చేసుకుంటారో… ఎదుటివారు చెప్పిన విషయాల్లోని సారాన్ని గ్రహించి అలాగే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి.