Home తెలంగాణ రైతు సమస్యలపై బీఆర్ఎస్, బీజేపీ పోరుబాట- కరీంనగర్ జిల్లాలో పోటాపోటీగా నిరసనలు-karimnagar bjp brs parties...

రైతు సమస్యలపై బీఆర్ఎస్, బీజేపీ పోరుబాట- కరీంనగర్ జిల్లాలో పోటాపోటీగా నిరసనలు-karimnagar bjp brs parties protest for farmers water crisis bandi sanjay rythu deeksha kcr tour ,తెలంగాణ న్యూస్

0

ఏప్రిల్ 5న కేసీఆర్ కరీంనగర్ పర్యటన

భూగర్భజలాలు అడగండి పుట్టేడు కష్టాల్లో ఉన్న రైతులకు మనోధైర్యం కల్పించి ఎండిపోయిన పంటలకు తగిన పరిహారం ప్రభుత్వం చెల్లించేలా ఒత్తిడి పెంచేందుకు పొలం బాట పట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో(KCR Karimnagar Tour) పర్యటించనున్నారు. ఈ నెల 5న కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖిగా కేసీఆర్(KCR) మాట్లాడనున్నారు. కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar), బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి రామకృష్ణారావు స్థానిక నాయకులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.

Exit mobile version