Home తెలంగాణ MLC Kavitha Arrest Case : కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు

MLC Kavitha Arrest Case : కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు

0

సుప్రీంలో దక్కని ఊరట…

ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేయగా… దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని… కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు… ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Exit mobile version