Home తెలంగాణ తుర్క చెరువు కన్జర్వేటివ్ జోన్ లో ఉన్న స్థలాలకు విల్లాల పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలు...

తుర్క చెరువు కన్జర్వేటివ్ జోన్ లో ఉన్న స్థలాలకు విల్లాల పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఆకుల సతీష్ డిమాండ్..

0

నిజాంపేట్ సర్వే నెంబర్ 338, 343, స్ప్రింగ్ వ్యాలీ కాలనీలో కొత్తగా 8 ప్లాట్లు(ప్లాట్ no 196-202) సృష్టించి, వాటికి నిజాంపేట్ మునిసిపల్ కార్పోరేషన్ లో అనుమతులు తీసుకున్నారని…. అసలు వెంచర్లలో లేని ప్లాట్లకు, కన్జర్వేటివ్ జోన్లో ఉన్న వాటికి టౌన్ ప్లానింగ్ అధికారులు టీపీఎస్ ఎలా అనుమతులు జారీ చేశారని‌ నిజాంపేట్ బిజెపి నాయకులు సతీష్ ప్రశ్నించారు. 2022 సెప్టెంబర్లో సరైన అనుమతులు లేవంటూ కూల్చి వేసిన ప్రాంతంలోనే మళ్లీ విల్లాస్ నిర్మాణాలు ఏ విధంగా సక్రమము ఎలా అవుతాయని, బిల్డర్లు ధనదాహం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్క్ స్థలం, ఓపెన్ ప్లేస్లో వెలసిన ప్లాట్లకు అధికారులు అనుమతులు జారీ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో స్థలానికి అధికారులు అనుమతులు జారీ చేశారని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అనుమతులను వెంటనే రద్దు చేయాలని సతీష్ డిమాండ్ చేశారు.

Exit mobile version