posted on Mar 21, 2024 2:26PM
ఈ మెస్సేజీలు పంపించడం ద్వారా కేంద్రం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందనీ, వెంటనే వీటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశించాలనీ కోరుతూ విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే వరకూ కేంద్ర ఎన్నికల సంఘం మిన్నకుండటం విమర్శలకు తావిస్తున్నది. విపక్షాల ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజులకు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. వికసిత భారత్ పేరిట కేంద్రం పౌరల ఫోన్లకు పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్ లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇటువంటి మెసేజ్ లను పౌరులకు పంపించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ తక్షణమే ఆ మెస్సేజ్ లను నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది.