Home తెలంగాణ కేంద్రానికి ఈసీ షాక్.. ఆ మెస్సేజ్ లు నిలిపివేయాలంటూ ఆదేశాలు | ec shock to...

కేంద్రానికి ఈసీ షాక్.. ఆ మెస్సేజ్ లు నిలిపివేయాలంటూ ఆదేశాలు | ec shock to center| orders| stop| whatsup| messeges| vikasit

0

posted on Mar 21, 2024 2:26PM

ఎన్నికల కోడ్ అమలు విషయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయో కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి.. కేంద్రంలోని మోడీ సర్కార్ పౌరల ఫోన్ లకు వాట్సాప్ మెసేజ్ ల రూపంలో పంపుతున్న ప్రకటనలు. ఇవి ప్రభుత్వ ప్రకటనలే అయినా ఎన్నికల వ్యయంలో చూపాల్సిన పని లేదు. అలాగే ప్రభుత్వం ప్రజలకు చేసిన మేళ్లు ఇవీ అంటూ మోడీ  చిత్రంతో వికసిత్ భారత్ పేరిట కుప్పలు తెప్పలుగా ప్రజలకు మెస్సేజ్ లు వస్తున్నాయి. ఇలా మెస్సేజ్ లు పంపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమే అయినా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని హెచ్చరించే వరకూ కేంద్రం పట్టనట్లే వ్యవహరించింది. అయితే ఆ మెస్సేజ్ లను తక్షణమే నిలిపివేయాలంటూ ఈసీ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసే వరకూ కేంద్రం కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నదన్న విషయం సామాన్యులెవరికీ తెలియనేలేదు. 

ఈ మెస్సేజీలు పంపించడం ద్వారా కేంద్రం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందనీ, వెంటనే వీటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశించాలనీ కోరుతూ విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే వరకూ కేంద్ర ఎన్నికల సంఘం మిన్నకుండటం విమర్శలకు తావిస్తున్నది. విపక్షాల ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు   కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజులకు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. వికసిత భారత్  పేరిట కేంద్రం పౌరల ఫోన్లకు పంపిస్తున్న వాట్సాప్ మెసేజ్ లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇటువంటి మెసేజ్ లను పౌరులకు పంపించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.   గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని మోడీ సర్కార్  చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తూ తక్షణమే ఆ మెస్సేజ్ లను నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది.  

Exit mobile version