Home తెలంగాణ విమానంలో సాంకేతిక లోపం.. గంటకు పైగా ఫ్లైట్ లోనే సీఎం రేవంత్ | technical issue...

విమానంలో సాంకేతిక లోపం.. గంటకు పైగా ఫ్లైట్ లోనే సీఎం రేవంత్ | technical issue in ibdigo flight| telangana| cm| stranded| inside| plane| hour| missed| mumbay

0

posted on Mar 18, 2024 12:30PM

సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన దాదాపు గంటకు పైగా విమానంలోనే చిక్కుపడిపోయారు. దీంతో ముంబైలో కీలక సమావేశానికి హాజరు కాలేకపోయారు. అలాగే ముంబైలో రాహుల్ గాంధీ న్యాయ సంకల్ప  సభకు కూడా హాజరు కాలేకపోయారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షిలు ముంబైలో  రాహుల్ గాంధీ  న్యయ సంకల్ప యాత్ర సభకు హాజరు కాలేకపోయారు. 

షెడ్యూల్ ప్రకారం వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలొ ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు హస్తినకు బయలుదేరాల్సి ఉంది. తీరా వీరంతా విమానంలోకి ఎక్కి కూర్చున్న తరువాత సరిగ్గా టేకాఫ్ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తెలెత్తింది.

దీంతో ఆ విమానం కదలకుండా మెరాయించింది. ఆ లోపం సరి చేసి విమానం బయలు దేరడానికి గంటకు పైగా సమయం పట్టింది. అంత సేపూ రేవంత్ రెడ్డి తదితరులు విమానంలోనే చిక్కుపడిపోయారు. ఈ జాప్యం కారణంగా రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కీలక సభకు వీరు హాజరు కాలేకపోయారు.  

Exit mobile version