Home తెలంగాణ ఆప్ నేతలకు రూ.100 కోట్లు, లిక్కర్ స్కామ్ లో కవితదే కీలక పాత్ర- ఈడీ ప్రకటన-hyderabad...

ఆప్ నేతలకు రూ.100 కోట్లు, లిక్కర్ స్కామ్ లో కవితదే కీలక పాత్ర- ఈడీ ప్రకటన-hyderabad ed announcement on brs mlc kavitha arrest delhi liquor scam ,తెలంగాణ న్యూస్

0

245 చోట్ల సోదాలు-15 మంది అరెస్ట్

ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha), ఆమె సహచరులు ఆప్ నేతలకు ముందస్తుగా డబ్బులు చెల్లించి, లిక్కర్ స్కామ్ ద్వారా లాభాలు పొందాలని చూశారని ఈడీ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి సహా 245 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకూ రూ. 128.79 కోట్లు తాత్కాలిక అటాచ్‌మెంట్ చేశామని ఈడీ (ED On Kavitha Arrest)తన ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించింది.

Exit mobile version