posted on Mar 18, 2024 12:30PM
షెడ్యూల్ ప్రకారం వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలొ ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు హస్తినకు బయలుదేరాల్సి ఉంది. తీరా వీరంతా విమానంలోకి ఎక్కి కూర్చున్న తరువాత సరిగ్గా టేకాఫ్ సమయంలో విమానంలో సాంకేతిక లోపం తెలెత్తింది.
దీంతో ఆ విమానం కదలకుండా మెరాయించింది. ఆ లోపం సరి చేసి విమానం బయలు దేరడానికి గంటకు పైగా సమయం పట్టింది. అంత సేపూ రేవంత్ రెడ్డి తదితరులు విమానంలోనే చిక్కుపడిపోయారు. ఈ జాప్యం కారణంగా రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కీలక సభకు వీరు హాజరు కాలేకపోయారు.