Home తెలంగాణ చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, యువకుడు మృతి-medak district two communities fight...

చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, యువకుడు మృతి-medak district two communities fight for fish ponds youth died ,తెలంగాణ న్యూస్

0

Medak News : చెరువులో చేపలు పట్టే విషయంలో బెస్త, ముదిరాజ్ వర్గాల మధ్య జరిగిన వివాదంలో ఒకరు మృతిచెందడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన మెదక్ జిల్లా(Medak News) హవెలిఘనపూర్ మండలం బూర్గుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బూర్గుపల్లిలో చేపలు పట్టే విషయంలో బెస్త, ముదిరాజ్ కులస్థుల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న వివాదం ముదిరింది. బూర్గుపల్లి పరిధిలో పెద్దచెరువు, శ్రీపతి చెరువు, పోచారం డ్యామ్(Pocharam Dam) లు ఉన్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య సభ్యత్వానికి సంబంధించిన వివాదం నెలకొంది. కాగా అన్ని చెరువులలో తమకు హక్కులు కల్పించాలని ముదిరాజులు డిమాండ్ చేయగా, బెస్త కులస్థులు అంగీకరించడం లేదు. దీంతో మూడేండ్ల నుంచి చేపలు పట్టడం లేదు. ఈ క్రమంలో చెరువులో చేపలు పట్టేందుకు బెస్త కులస్థులు కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Exit mobile version